
న్యూస్

కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో చెన్నైలో ఒక్కసారిగా కలకలం రేగింది. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి వచ్చిన ఈమెయిల్లో పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ నివాసం, అల్వార్‌పేటలోని ధనుష్ ఇంట్లో బాంబులు అమర్చినట్లు పేర్కొన్నారు. ఈ సమాచారం బయటకు రావడంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కలిసి రెండు ఇళ్ల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దాదాపు గంటన్నర పాటు సాగిన సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇది ఫేక్ మెయిల్ అని అధికారులు నిర్ధారించారు. ఆకతాయిల పని అని భావిస్తున్న పోలీసులు సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి విచారణ ప్రారంభించారు. ఇలాంటి తప్పుడు సమాచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, భద్రతను మరింత పెంచారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!