
.png&w=3840&q=75)
విజయవాడలో పిల్లలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేశారు.
అడ్మిన్ డీసీపీ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలతో ఈ సిట్‌ను రూపొందించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించడమే లక్ష్యంగా అధికారులు దర్యాప్తును విస్తరించారు.
ఈ కేసు సంబంధిత వివరాల కోసం ఢిల్లీ, ముంబైతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపించారు. నిందితుల బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను సూక్ష్మంగా పరిశీలిస్తూ ఆధారాలు సేకరిస్తున్నారు.
అలాగే, వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పిల్లల అక్రమ విక్రయాలకు సంబంధించిన అన్ని కోణాలను వెలికితీయడమే ఈ ప్రత్యేక దర్యాప్తు లక్ష్యంగా పోలీసులు స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!