
క్రీడలు

ప్రధాని మోదీ కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉన్న ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి మరియు వ్యక్తిగత బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని, తొమ్మిది ముఖ్యమైన పనులు చేస్తామని మాటివ్వాలని ఆయన ప్రజలను కోరారు.
అమ్మ పేరుతో మొక్కలు నాటడం, నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, తృణధాన్యాల వినియోగాన్ని పెంచడం, నూనె పదార్థాల వినియోగాన్ని తగ్గించడం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలను ప్రధాని సూచించారు. అలాగే జనసంచారం ఎక్కువగా ఉండే మరియు మతపరమైన ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించడం, స్థానిక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!