
రాజకీయాలు

దేశీయ వాహన పరిశ్రమ 2025–26 ఆర్థిక సంవత్సరంలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ప్రకారం టోకు విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 10.4 శాతం పెరిగి 2.83 కోట్ల యూనిట్లకు చేరుకున్నాయి. ప్యాసింజర్, కమర్షియల్, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాలు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరాయి. సెప్టెంబరులో వాహనాలపై జీఎస్టీ తగ్గింపు ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది.
వాహన ఎగుమతులు కూడా 24 శాతం పెరిగి 66,47,685 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే తయారీ, సరఫరా శ్రేణి, వాహనాల గిరాకీపై ప్రభావం చూపవచ్చని సియామ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి ఆర్థిక దృక్పథం సానుకూలంగా ఉన్నప్పటికీ భవిష్యత్ పరిస్థితులపై అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!