
క్రీడలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీనాక్షి, మహేష్ కుమార్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రధానంగా చర్చించారు. పార్టీ బలోపేతం మరియు పరిపాలన అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
డీలిమిటేషన్ వల్ల తెలంగాణకు నష్టం జరిగితే పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చ జరిగింది. ఈ విషయాలపై మరింతగా చర్చించేందుకు వారంలోపే పీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పార్టీ సన్నద్ధంగా ఉన్నట్లు ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!