
జనరల్

రాష్ట్రంలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
రెండో విడతలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 415 సర్పంచ్ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 38,322 వార్డు స్థానాల్లో 8,300 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది.
ఇవాళ అధికారులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందజేశారు. అధికారులు రేపటి ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!