

గండిపేట మండలంలోని పుప్పలగూడ–నార్సింగి గ్రామాల మధ్య ఉన్న ముష్కిన్ చెరువులో జరిగిన ఆక్రమణలను హైడ్రా శనివారం భారీ ఆపరేషన్ ద్వారా తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంది.
చెరువు సహజ సరిహద్దులను మార్చి రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం భూమిని సిద్ధం చేస్తున్నారని అధికారులు గుర్తించారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలతో కలిసి పరిశీలించగా చెరువు విస్తీర్ణం సుమారు 59.11 ఎకరాలు, ఎఫ్‌టీఎల్ 52.20 ఎకరాలు, ప్రభుత్వ శిఖం భూమి 20.23 ఎకరాలుగా నిర్ధారించారు. సుమారు 35 ఎకరాల ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ పనులు పూర్తిచేశారు.
సామాజిక బాధ్యత నిధుల పేరుతో చెరువు పరిధిని తగ్గించి అక్రమాలకు అవకాశం కల్పిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ముందుగా ఇచ్చిన గడువులో స్వచ్ఛందంగా గుడిసెలు ఖాళీ చేయగా, చివరికి మిగిలిన నిర్మాణాలను కూడా తొలగించారు. చెరువును కాపాడిన హైడ్రా చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!