
జనరల్

భవిష్యత్ రాజధాని అమరావతి అభివృద్ధికి అనుగుణంగా అర్బన్ మొబిలిటీ ప్రణాళికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 61వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించిన 18 కీలక అంశాలకు ఆమోదం తెలిపింది.
హైకోర్టు భవనాల మౌలిక వసతుల కోసం రూ.547.07 కోట్ల పనులకు అథారిటీ ఆమోదం తెలిపింది. అలాగే పీపీపీ విధానంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా జెయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగర గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్, లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు, ప్రత్యేక ట్రైబ్యునల్, మీడియేషన్ సెంటర్ ఏర్పాటు వంటి ప్రతిపాదనలకు కూడా అంగీకారం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!