
సినిమాలు

న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యను హిట్ అండ్ రన్ ప్రమాదంగా చూపించేందుకు నిందితులు ప్రణాళిక వేసినట్లు పోలీసులు గుర్తించారు. వినయ్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో బైక్ స్టంట్స్ చేసే అభిజిత్ అలియాస్ నాని అనే వ్యక్తిని ఈ పనికి వినియోగించినట్లు తెలుస్తోంది.
హిట్ అండ్ రన్ చేస్తే రూ.2 లక్షలు ఇస్తానని, పట్టుబడితే ఆక్సిడెంట్ కేసుగా బయటపడతావని వినయ్ చెప్పినట్లు సమాచారం. దీనికి ఒప్పుకున్న అభిజిత్ మొయినుద్దీన్‌ను ఢీకొట్టి, నాంపల్లి నుంచి తుక్కుగూడా వరకు సుమారు 50 కిలోమీటర్లు కేవలం 13 నిమిషాల్లో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!