

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా పార్లమెంట్ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం సమతుల్య నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రస్తుత సీట్ల ప్రాతిపదికన ఎంపీ స్థానాలను పెంచుతూ అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుందని చెప్పారు.
రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ అవి అర్థరహితమని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలో ప్రాతినిధ్యం లేదన్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు. గత పదేళ్లలో దక్షిణాది నాయకులు ఉపరాష్ట్రపతులు, కేంద్ర మంత్రులుగా కీలక పదవులు చేపట్టారని పేర్కొన్నారు. అలాగే రాహుల్ గాంధీ కేరళకు వెళ్లడం, అభిషేక్ సింఘ్వీ తెలంగాణ నుంచి రాజ్యసభకు రావడం వంటి విషయాలపై ప్రశ్నలు లేవనెత్తారు. మనం అందరం భారతీయులమే కాబట్టి ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!