
గాసిప్స్

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో అధికార కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధిస్తోంది. ముఖ్యంగా ముంబైలో మొత్తం స్థానాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి 131 స్థానాలకు పైగా లీడ్లో కొనసాగుతోంది. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో అధికార కూటమి బలాన్ని మరోసారి చాటుతున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అటు ఉద్ధవ్ శివసేన కూటమి 73 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 15 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడితే స్థానిక రాజకీయ సమీకరణాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!