

ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలం శ్యాంపూర్ సమీపంలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ప్రాంతంలో కలకలం రేగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఆసిఫాబాద్ డిపో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను రక్షించి 108 అంబులెన్స్ ద్వారా ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. TS20T 9369 నంబర్ గల ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తెల్లవారుజామున ఇరుకైన శ్యాంపూర్ బ్రిడ్జిపై రక్షణ గోడ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడిన మంత్రి గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటన స్థలంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఆర్టీసీ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!