

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన జలమార్గాలలో ఒకటైన ఈ జలసంధి నిర్వహణలో ఇరాన్ కొత్త దశలోకి అడుగుపెడుతోందని తెలిపారు. తమ దేశంపై దాడి చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం కోరాలని టెహ్రాన్ భావిస్తున్నట్లు వెల్లడించారు.
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలకు, గాయపడిన వారికి న్యాయం చేయాలని ఆయన చెప్పారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీకి ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ తమ హక్కులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కొత్త నియమాలు తీసుకొచ్చింది. అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని రోజుకు కేవలం పదిహేను నౌకలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇరాన్ అనుమతి తీసుకున్న నౌకలకే ఈ జలసంధిలో ప్రయాణించే అవకాశం కల్పించనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!