
న్యూస్

లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రమాదానికి గురైంది. నిన్న రాత్రి 11:30 సమయంలో న్యూయార్క్‌లో ఈ ఘటన జరిగింది. మాంట్రియల్ నుంచి వచ్చిన CRJ-900 విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై ఉన్న అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానం ముందుభాగం దెబ్బతింది. నలుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడి ఆసుపత్రికి తరలించారు. విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు.
ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి. ఫ్లైట్రాడార్24 ప్రకారం విమానం గంటకు 24 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. ప్రమాదానికి ముందు అగ్నిమాపక వాహనాన్ని తొలగించాలని ఎయిర్ ట్రాఫిక్ అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. ఈ ఘటనతో విమాన రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు.












.avif&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!