

దేశవ్యాప్తంగా ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన పదార్థాల లభ్యతపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణరావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంధన ఉత్పత్తి, నిల్వలు, పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎల్పీజీ డిమాండ్‌కు అనుగుణంగా తగిన నిల్వలను ఉంచి సమయానికి సరఫరా చేయాలని రాష్ట్రాలకు సూచించారు. అలాగే పెట్రోల్, గ్యాస్ కొరతపై వ్యాపిస్తున్న తప్పుడు వార్తలను అరికట్టాలని ఆదేశించారు. దేశంలో ఎల్పీజీ కొరత లేదని స్పష్టం చేస్తూ, పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులకు మాత్రమే రీఫిల్ బుకింగ్ చేయాలని తెలిపారు.
ఇక భవిష్యత్తులో పైప్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. గ్యాస్ నెట్వర్క్ విస్తరణతో వినియోగదారులకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. అలాగే బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అరికట్టేందుకు రాష్ట్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!