

భారత శిల్పకళా రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతూ ఉత్తరప్రదేశ్ నోయిడాలోని తన కుమారుడు నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 99 సంవత్సరాలు.
ఈ విషయాన్ని ఆయన కుమారుడు అనిల్ సుతార్ మీడియాకు ధృవీకరించారు.
భారతదేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన అనేక విగ్రహాలకు రూపకర్త అయిన రామ్ సుతార్, గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీతో పాటు హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
1925 ఫిబ్రవరి 19 న మహారాష్ట్రలోని గోందూర్ గ్రామంలో జన్మించిన రామ్ సుతార్, జీవితాంతం శిల్పకళకు అంకితమయ్యారు. భారత కళా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
అతని విశిష్ట సేవలకు గుర్తింపుగా 1999 లో పద్మశ్రీ, 2016 లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.
రామ్ సుతార్ మరణం భారత శిల్పకళా రంగానికి తీరని లోటు. ఆయన సృష్టించిన శిల్పాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!