
ఆరోగ్యం

హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో పీసీసీ ఎంపిక చేసిన 60 మంది ప్రతినిధులకు మాస్టర్ ట్రైనింగ్ అందించనున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించి, దానిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడమే ఈ శిక్షణ లక్ష్యం.
ఈ కార్యక్రమం కోసం ఏఐసీసీ ఢిల్లీ నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపింది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు, వివరణాత్మక చర్చల ద్వారా శిక్షణ అందించనున్నారు. శిక్షణ పూర్తయిన అనంతరం మాస్టర్ ట్రైనర్లుగా ఎంపికైన ఈ బృందం తమ తమ నియోజకవర్గాల్లో బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్ఏలు) శిక్షణ ఇవ్వనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!