
ఆరోగ్యం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సామాజిక భద్రత పింఛన్ల మంజూరుపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 12 నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు సహా అర్హులైన వారందరికీ ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది.
ఇప్పటివరకు పింఛన్ పొందని అర్హుల కోసం త్వరలో ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పోర్టల్ ద్వారా కొత్త దరఖాస్తులను స్వీకరించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో తొలగించబడిన పింఛన్లకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది అర్హులకు ఉపశమనం కలగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!