
ఆరోగ్యం

పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను పోలీసులు వరుసగా మూడో రోజు కూడా విచారిస్తున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సాయంత్రం వరకు అతణ్ని ప్రశ్నించనున్నారు. ఇవాళ్టితో మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగియనుండటంతో సాయంత్రం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది.
బాధితురాలితో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్లలో జరిగిన చాటింగ్లకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. వాటి ఆధారంగా భగీరథ్‌ను లోతుగా విచారిస్తున్నట్టు సమాచారం. కేసు దర్యాప్తు అధికారి పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ విజయ్ వర్ధన్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. డిజిటల్ కమ్యూనికేషన్ ఆధారాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!