
ఆరోగ్యం

పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకు ఆరోగ్యకరమైన పోటీ ఇస్తుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన పెట్టుబడిదారులను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేసి అభినందించారు. ప్రతి మంత్రి తమ రాష్ట్రాన్ని సమర్థంగా ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని, పెట్టుబడిదారులతో చర్చలు జరిపి ఉపాధి కల్పనలో నమ్మకాన్ని పెంచాలని ఆయన సూచించారు.
దేశ అభివృద్ధిని వేగవంతం చేయడంలో రాష్ట్రాల చొరవను ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తారని లోకేశ్ పేర్కొన్నారు. లోకేశ్ పోస్టుకు స్పందించిన కీర్తన, తమిళనాడు ప్రజలకు ముఖ్యంగా యువతకు అవకాశాలు కల్పించేందుకు చిత్తశుద్ధి, వినయం, పట్టుదలతో పనిచేస్తూనే ఉంటానని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!