

మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో అడివి శేష్ దాదాపు నాలుగేళ్ల తర్వాత డెకాయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని కలిగించడంతో ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, టొవినో థామస్ నటించిన పల్లి చట్టంబి సినిమాలు కూడా ఈ వారాంతంలో విడుదలవుతున్నాయి.
ఇక ఓటీటీ వేదికలపై ఈ నెల 6 నుంచి 12 వరకు మొత్తం పద్నాలుగు సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల కానున్నాయి. వీటిలో రాధిక శరత్ కుమార్ నటించిన తాయ్ కిళవి సినిమా కొంత ఆసక్తిని కలిగిస్తోంది. తు యా మై, హాళ్ వంటి ఇతర భాషా సినిమాలు కూడా చూడదగ్గవిగా కనిపిస్తున్నాయి. వీకెండ్ సమయంలో మరికొన్ని అకస్మాత్తు విడుదలలు కూడా ఉండే అవకాశం ఉంది.
ఈ వారం ఓటీటీలో విడుదలలు ఇవి:
నెట్ ఫ్లిక్స్
బీఫ్ సీజన్ 2 – ఈ నెల 8
18th రోజ్ – ఈ నెల 9
బిగ్ మిస్టేక్స్ – ఈ నెల 9
త్రాష్ – ఈ నెల 10
తు యా మై – ఈ నెల 10
అమెజాన్ ప్రైమ్ వీడియో
ద బాయ్స్ సీజన్ 5 – ఈ నెల 8
క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ – ఈ నెల 10
హాట్ స్టార్
తాయ్ కిళవి – ఈ నెల 10
సోనీ లివ్
తో తీ అని ఫుజీ – ఈ నెల 10
జీ5
ఖాకీ సర్కస్ – ఈ నెల 10
సన్ నెక్స్ట్
హాళ్ – ఈ నెల 10
కనిమంగళం కొవిలకం – ఈ నెల 10
ఆపిల్ టీవీ ప్లస్
ఔట్‌కమ్ – ఈ నెల 10
లయన్స్ గేట్ ప్లే
వైల్డ్ క్యాట్ – ఈ నెల 10






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!