

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని సాధించినప్పటికీ, ఆయన నటిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర మాత్రం పదేపదే వాయిదా పడుతూ అభిమానులను నిరాశపరుస్తోంది. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా కాలం క్రితమే విడుదల కావాల్సి ఉండగా, ఇంకా విడుదల కాలేదు. ఈ ఏడాది జూలైలో సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
అయితే తాజా సమాచారం ప్రకారం, ఆ సమయానికి కూడా సినిమా విడుదలయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో అభిమానుల్లో నిరాశ పెరుగుతోంది. రోజురోజుకి ఆలస్యం కావడంతో సినిమా హైప్ తగ్గిపోతున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆలస్యమైనా విజయవంతమవుతుందనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!