
గాసిప్స్

హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కదులుతున్న వాహనాల టైర్ల నుంచి నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేసే సెల్ఫ్ ఛార్జింగ్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత వాణిజ్యంగా అందుబాటులోకి వస్తే స్మార్ట్ వాహనాల్లోని చిన్న సెన్సర్లకు బ్యాటరీ అవసరం లేకుండా పనిచేయగలవు. ఈ పరిశోధనకు డాక్టర్ ఉజ్వల్ పాల్ నేతృత్వం వహించారు.
ట్రైబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ ఆధారంగా రూపొందించిన ఈ పవర్ వీల్ టైర్ల కదలికతో పాటు వేడిని కూడా విద్యుత్‌గా మారుస్తుంది. త్రీడీ ప్రింటింగ్, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ వంటి ఆధునిక సాంకేతికతలతో దీన్ని అభివృద్ధి చేశారు. దీని ద్వారా టైర్ ప్రెజర్ సెన్సర్లు, బ్రేక్ సెన్సర్లకు నిరంతర విద్యుత్ అందించవచ్చు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!