

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వాతావరణం మార్పులతో ఎండలు, వానలు కలిసి ప్రభావం చూపుతున్నాయి. కొన్ని జిల్లాల్లో తీవ్రమైన ఎండలు కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ పరిస్థితి ఆవర్తనాల ప్రభావంతో ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చు. మరోవైపు పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో వడగాలులు ప్రభావం చూపుతున్నాయి.
రైతులు పొలాల్లో పని చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు ఎండ సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే పిడుగులు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!