
గాసిప్స్

చెన్నైలోని టీ.నగర్ ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా 45 తులాల బంగారం ఉన్న సంచిని గుర్తించిన పారిశుధ్య కార్మికురాలు దానిని నిజాయితీగా పాండి బజార్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ బంగారాన్ని యజమానికి అందజేశారు.
ఆమె నిజాయితీ గురించి తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఆమెను సన్మానించి రూ.1 లక్ష నగదు బహుమతి అందించారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆమెను సన్మానిస్తూ, సమాజంలో ఇటువంటి నిజాయితీ గల వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించడం ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!