
న్యూస్

పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాశ్రేయస్సు, ఆర్టీసీ పరిరక్షణ దృష్ట్యా సమ్మెను నిలిపివేయాలని కోరుతూ, సమస్యలకు సమ్మె పరిష్కారం కాదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కార్మికులు సహకరించాలని ఆయన అన్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. మొత్తం 32 డిమాండ్లలో 29 వెంటనే పరిష్కరించవచ్చని, ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ఈ అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!