
న్యూస్

కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో, మెట్రో పిల్లర్ నంబర్ 734 వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జేఎన్టీయూ నుండి కూకట్‌పల్లి వైపు వెళ్లే జాతీయ రహదారిపై ఈ ఘటన జరగడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బస్సులో ఎగసిపడిన మంటలు, పొగ చూసి చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, బస్సులో ప్రయాణికులు ఉన్నారా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!