
టెక్నాలజీ

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. మహిళలకు సమాన హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ఇది చారిత్రాత్మక అవకాశమని ఆయన పేర్కొన్నారు. నలభై ఏళ్లుగా దేశం ఈ బిల్లును ఎదురుచూస్తోందని గుర్తుచేస్తూ, పార్టీ భేదాలను పక్కన పెట్టి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని ఎంపీలను కోరారు.
మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు మరియు డీలిమిటేషన్ బిల్లులపై ఓటింగ్‌కు ముందు మోదీ ఎక్స్‌లో భావోద్వేగ పిలుపునిచ్చారు. ‘‘మీ ఇంట్లోని తల్లి, సోదరీమణి, కుమార్తె, భార్యను తలచుకుని మీ అంతరాత్మ చెప్పేది విని ఓటేయండి’’ అని అన్నారు. మహిళా శక్తికి సేవ చేయడానికి ఇది గొప్ప అవకాశం అని పేర్కొంటూ, మహిళల అవకాశాలను అడ్డుకోకూడదని, అందరూ కలిసి చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు.






.webp&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!