

చాలా మంది యువ ఆటగాళ్లు హైలైట్ అవుతున్నా, ప్రభ్ సిమ్రన్ సింగ్ మాత్రం నిశ్శబ్దంగా తన ఆటతో గుర్తింపు పొందుతున్నాడు. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఈ ఓపెనర్ తొలి బంతి నుంచే దూకుడుగా ఆడటం అతని ప్రత్యేకత. ఈ సీజన్లో పంజాబ్ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి అగ్రస్థానంలో ఉంది. ముంబయిపై మ్యాచ్‌లో ప్రభ్ సిమ్రన్ 39 బంతుల్లో అజేయంగా 80 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 25 బంతుల్లో 51 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం 211 పరుగులతో టాప్ రన్ స్కోరర్లలో ఒకరిగా ఉన్నాడు.
యువరాజ్ సింగ్ శిష్యుడైన ప్రభ్ సిమ్రన్ తన ఆటలో దూకుడుతో పాటు పరిపక్వతను కూడా చూపిస్తున్నాడు. గత సీజన్లో 17 మ్యాచ్‌ల్లో 549 పరుగులు చేసి పంజాబ్ ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లోనూ తన స్ట్రైక్ రేట్‌ను తగ్గించకుండా నిలకడగా పరుగులు చేస్తున్నాడు. దీనికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ప్రశంసలు తెలిపారు. పటియాలాలో జన్మించిన ప్రభ్ సిమ్రన్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాడు. తన ప్రతిభ, పట్టుదలతో ఐపీఎల్లో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!