

యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల ఉడికించిన బియ్యం సేకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణలో పండే ధాన్యం ఉడికించిన బియ్యం తయారీకి అనుకూలమని వివరించారు. గత ఆరు యాసంగి సీజన్‌ల గణాంకాలు కూడా ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయని తెలిపారు.
ప్రస్తుతం యాసంగి సీజన్‌లో సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉడికించిన బియ్యానికి ఉన్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 30 లక్షల మెట్రిక్ టన్నుల ఉడికించిన బియ్యం, 5 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యం సరఫరా చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!