

టీసీఎస్ నాసిక్ క్యాంపస్లో లైంగిక వేధింపులు, మత మార్పిడుల ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన అత్యంత గంభీరమైనదని, దీని వెనుక ఒక ముఠా ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. టీసీఎస్ యాజమాన్యం కూడా ఈ ఘటనను ఖండించిందని పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కార్నిక్ తెలిపిన ప్రకారం, బాధితురాలు పలుమార్లు హెచ్ఆర్ విభాగానికి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నట్లు కూడా ఆరోపించారు. దర్యాప్తులో మరో ఏడుగురు మహిళలు ముందుకు వచ్చి తమపై జరిగిన వేధింపుల గురించి వెల్లడించారు. 2022 ఫిబ్రవరి నుంచి 2026 మధ్య ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలిపారు. నిందితులకు అతివాద గ్రూపులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!