
టెక్నాలజీ

దేశీయ బులియన్ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొనడంతో బంగారం, వెండి దిగుమతులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు ఆలస్యమవడంతో భారతీయ బ్యాంకులు విదేశీ సరఫరాదారుల నుంచి దిగుమతి ఆర్డర్లను నిలిపివేశాయి. దీంతో విలువైన లోహాల సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది.
ఇప్పటికే దిగుమతి అయిన బంగారం, వెండి కస్టమ్స్ అనుమతులు లేక విమానాశ్రయాల్లోనే నిలిచిపోయాయి. ఈ పరిణామం ఆభరణాల రంగంతో పాటు పెట్టుబడిదారుల్లో కూడా ఆందోళనను పెంచుతోంది. పరిస్థితి ఎలా మారుతుందో అన్నదానిపై అందరూ ఎదురుచూస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!