
బిజినెస్

ఎస్బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్ పేరును దుర్వినియోగం చేస్తూ పైరసీ కంటెంట్‌ను ప్రసారం చేయడానికి కొందరు మోసగాళ్లు ప్రయత్నిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఐబొమ్మ పేరుతో ముందే నడుస్తున్న కొన్ని పైరసీ సైట్లను కొత్తగా ఎడిట్ చేసి, అవి ఎస్బీఐ ఇన్సూరెన్స్ అధికారిక వెబ్సైట్లా కనిపించేలా మార్చినట్లు గుర్తించారు. ఈ నకిలీ లింక్‌లపై క్లిక్ చేస్తే అసలు పైరసీ సైట్లకే మార్గం సుగమమయ్యేలా వారు సెట్టింగ్ చేసినట్టు అధికారులు తెలిపారు.
ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, సైబర్ భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. త్వరలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఇన్సూరెన్స్ అధికారులు అధికారిక ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ప్రజలు ఇలాంటి నకిలీ లింక్‌లను నమ్మవద్దని, అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!