
-1769244931272.webp&w=3840&q=75)
మహిళా క్రికెటర్ స్మృతి మంధాన స్నేహితుడు, నిర్మాత విజ్ఞాన్ మానేపై పలాశ్ ముచ్చల్ పరువునష్టం నోటీసులు పంపారు. తప్పుడు ఆరోపణల ద్వారా తన ప్రతిష్టకు నష్టం కలిగించారని, రూ.10 కోట్ల పరిధిలో నోటీసులు తన లాయర్ ద్వారా మానేకు పంపించారని తెలిపారు.
మానే శనివారం పలాశ్ ముచ్చల్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన స్నేహితుడిగా స్మృతి కుటుంబానికి దగ్గరగా ఉన్న మానే, స్మృతి మంధాన మరియు పలాశ్ వివాహం రద్దైన కారణంగా మోసపోయినట్లు, పెళ్లి రోజే పలాశ్ మరో యువతితో పట్టుబడ్డారని మీడియాకు తెలిపారు. అదేవిధంగా, ఓ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చిన రూ.40 లక్షలను పలాశ్ తిరిగి ఇవ్వలేదని మానే ఆరోపించారు.
పలాశ్ ముచ్చల్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, మానే ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టకు నష్టం కలిగించే ప్రయత్నం చేశాడని అన్నారు. దీనిని సులభంగా వదలబోవడంలేదని, తదుపరి చర్యగా తన లాయర్ ద్వారా మానెకు పరువునష్టం నోటీసులు పంపినట్లు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!