
న్యూస్

ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు సుమారు 25 రోజుల పాటు సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర వర్గాలు తెలిపాయి. హర్ముజ్ జలసంధి మూసివేత జరిగితే చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని పేర్కొన్నారు. అదనంగా మరో 25 రోజుల సరుకు ట్రాన్సిట్‌లో ఉందని సమాచారం.
అయితే ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకు పైగా కొనసాగితే చమురు కొరత ఏర్పడి ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష కొనసాగిస్తూ, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!