
రాజకీయాలు

శ్రీ విష్ణు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన విష్ణు విన్యాసం, మృత్యుంజయ సినిమాలు కొద్దిరోజుల గ్యాప్లోనే విడుదలయ్యాయి. ఇప్పుడు విష్ణు విన్యాసం సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఇందులో నయన్ సారిక కూడా నటించారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి పలు భాషల్లో అందుబాటులో ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూడగలుగుతున్నారు. ఈ చిత్రానికి యదునాథ్ మారుతి రావు దర్శకత్వం వహించగా, సుమంత్ నాయుడు నిర్మించారు. సంగీతాన్ని జి. రాధన్ అందించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!