
న్యూస్

వీసీ సజ్జనార్ హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న సోషల్ మీడియా పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. నగరంలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేస్తూ, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఉందన్న వార్తల ప్రభావంతో హైదరాబాద్లో కూడా ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూలలో నిలుస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో 60 రోజుల వరకు సరిపడా ఇంధనం నిల్వలో ఉందని సజ్జనార్ వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై నిఘా పెట్టామని చెప్పారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న 186 పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారని, ప్రజలు అపోహలు నమ్మకుండా సహకరించాలని కోరారు.

.jpeg&w=3840&q=75)

















.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!