

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గత మూడు దశాబ్దాల క్రితం చేపట్టిన ఐటీ, టెక్నాలజీ, విద్యుత్ సంస్కరణలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్ 2026లో పాల్గొని ఆయన మాట్లాడుతూ నాలెడ్జ్ ఎకానమీనే భవిష్యత్తని అన్నారు. ఐటీ రంగానికి ఇచ్చిన ప్రోత్సాహంతో మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు హైదరాబాద్‌కు రావడంతో పాటు జీనోమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులు ఏర్పడి ఫార్మా రంగంలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయని తెలిపారు.
ఇక భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ వంటి టెక్నాలజీలతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని సీఎం తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి రంగాలు విద్యుత్ ఉత్పత్తిలో కీలకమవుతాయని పేర్కొన్నారు. యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ కొరత పెరిగిన నేపథ్యంలో పైప్డ్ నాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత పెరిగిందన్నారు. తిరుమలలో దర్శన సమయాన్ని తగ్గించేందుకు ఏఐ వినియోగం చేస్తున్నామని, త్వరలో డిజిటల్ హెల్త్ రికార్డులు, ఏఐ డాక్టర్, ఏఐ అగ్రోనమిస్ట్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని వెల్లడించారు.




















.webp&w=3840&q=75)
.avif&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!