

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా బిజినెస్ పరంగా మంచి హైప్‌ను సొంతం చేసుకుంటోంది. కలర్ ఫొటో, బేబి వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ల పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించగా, తాజాగా ఈ సినిమా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మిడ్ రేంజ్ చిత్రాల్లో అరుదుగా కనిపించే రేటుకు ఈ డీల్ కుదిరినట్లు సమాచారం.
మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో హక్కులను టీ సిరీస్ సౌత్ మ్యూజిక్ లేబుల్ సొంతం చేసుకుంది. ఈ స్థాయిలో ఆడియో రైట్స్ అమ్ముడవడం సినిమా పై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. ఇంతకు ముందు బేబి చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో పాటు జాతీయ అవార్డులు కూడా దక్కించుకుంది. అలాగే కలర్ ఫొటో కూడా జాతీయ అవార్డు గెలుచుకుంది. హీరో కిరణ్ అబ్బవరం నటించిన K-ర్యాంప్ కూడా కమర్షియల్ సక్సెస్ సాధించడంతో ఈ కాంబినేషన్‌పై ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి కనిపిస్తోంది.
ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ చిత్రీకరణ తుదిదశలో ఉంది. ఈ వారంలోనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. మణిశర్మ స్వరపరిచిన పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఉంటాయని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!