
సినిమాలు

కాంగ్రెస్ పార్టీకి చెందిన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఏఐసీసీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఒక అధికారిక లేఖను విడుదల చేశారు.
తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపినట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీతో తన అనుబంధాన్ని ముగిస్తున్నట్లు స్పష్టంగా వెల్లడించారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల జరిగిన సభలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ కండువాను తీసేసి గ్రీన్ కండువా కప్పుకోవడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ చర్యతో ఆయన భవిష్యత్ రాజకీయ అడుగులపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!