
న్యూస్

తాజా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించగా, నీతీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒక రాష్ట్రాన్ని పదిసార్లు పాలించడం అరుదైన ఘనతగా నిలిచిందని గుర్తిస్తూ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయన పేరును తమ జాబితాలో పొందుపరిచింది.
సీఎం నీతీశ్‌కు పంపిన అభినందన లేఖలో సంస్థ ఇలా పేర్కొంది:
“1947 నుంచి 2025 వరకు దేశంలో పదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి వ్యక్తి కావడం భారత ప్రజాస్వామ్యానికి గర్వకారణం. ఇది ఒక విశిష్టమైన రికార్డ్. మీ అంకితభావం, దూరదృష్టి నాయకత్వం, బీహార్ ప్రజలు మీపై ఉంచిన విశ్వాసానికి ఈ అరుదైన విజయం నిదర్శనం.”
అలాగే, సుపరిపాలన, అభివృద్ధి, సామాజిక సంక్షేమం కోసం నీతీశ్ చేస్తున్న కృషి లక్షల మందికి స్ఫూర్తిగా నిలుస్తోందని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పేర్కొంది.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!