

ముద్దాడ రవిచంద్ర ఈ రోజు ఉదయం 7.34 గంటలకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీటీడీ పాలక మండలి సభ్య కార్యదర్శిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ఆయనకు ప్రమాణ స్వీకారం చేయించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముద్దాడ రవిచంద్ర దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత రంగ నాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయం ముందు మీడియాతో మాట్లాడిన ఈవో రవిచంద్ర, గత నెల రోజులుగా తిరుమలలో అనేక విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. శ్రీవారి భక్తులకు తాను కూడా ఒక భక్తుడిగా సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తానని అన్నారు. భక్తుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను స్వయంగా పరిశీలించి, భక్తులకు మరింత మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!