

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా యాదగిరిగుట్టకు వెళ్లి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సమృద్ధిగా వర్షాలు పొంది, పాడి పంటలతో సుఖసంతోషాలతో జీవించాలని, అలాగే ప్రజాపాలన ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. ఈ వివరాలను గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
అదే సమయంలో యాదగిరిగుట్టలో ప్రారంభం కానున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు–2026 పోస్టర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారి ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా 2026 జనవరి నెలంతా రోడ్డు భద్రతను ప్రధాన అంశంగా తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 1 నుంచి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని నిర్వహించి, 31 రోజుల సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


.jpeg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!