

ఏపీ రాజకీయ పటంలో 2029 ఎన్నికల నాటికి భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు, లోక్సభ స్థానాలు 25 నుంచి 38కు పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రేపు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.
ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ సీట్లు సుమారు 50 శాతం పెరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ స్థానాలు కూడా దామాషా ప్రకారం పెరగనున్నాయి. మొత్తం 263 అసెంబ్లీ స్థానాల్లో 87 సీట్లు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. అలాగే ఏపీలోని లోక్సభ సీట్లలో 13 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయనున్నారు.
పార్లమెంటు ఆమోదం అనంతరం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ కొత్త నియోజకవర్గాలు 2029 ఎన్నికల నాటికి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుతో పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!