
క్రీడలు

జి. కిషన్ రెడ్డి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ధురంధర్ 2ను వీక్షించి ప్రశంసలు కురిపించారు. దర్శకుడు ఆదిత్య ధర్ను అభినందిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతంగా సినిమా తెరకెక్కించారని అన్నారు. ఈ చిత్రం కేవలం వినోదం మాత్రమే కాకుండా బాధ్యతను కూడా గుర్తు చేసేలా రూపొందిందని, దేశ రక్షణ కోసం భద్రతా సిబ్బంది చేసే త్యాగాలను స్పష్టంగా చూపించిందని పేర్కొన్నారు.
దేశ సమగ్రతపై వచ్చిన సవాళ్లు, శత్రు దేశాల కుట్రలు, వాటిని భారతదేశం ఎలా ఎదుర్కొంటుందో సినిమా చక్కగా ప్రతిబింబించిందన్నారు. సర్జికల్ స్ట్రైక్ వంటి సంఘటనలను ప్రస్తావిస్తూ దేశ రక్షణలో భద్రతా బలగాల పాత్రను వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తప్పక చూడాలని, దేశ భద్రత కోసం సైన్యం చేస్తున్న కృషిని అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సినిమాలో నటీనటులు కేవలం నటించలేదు, జీవించారని కొనియాడారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!