
న్యూస్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గ్యాలరీలో ఓ అభిమాని నిమ్మకాయలతో మంత్రాలు చదవడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై సీఎస్కే, ఎస్ఆర్‌హెచ్‌పై ఫిర్యాదు చేసినట్లు ఒక నకిలీ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయి చర్చనీయాంశమైంది.
ఈ విషయంపై స్పందించిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఆ లేఖ పూర్తిగా నకిలీదని స్పష్టం చేశారు. అయితే గతంలో ఒక ఫ్రాంచైజీ యజమాని ప్రత్యర్థి జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో మూఢనమ్మకాల ఆచారాలు పాటించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా ఘటన నకిలీలా కనిపిస్తున్నప్పటికీ, ఇలాంటి విషయాలు పూర్తిగా కొత్తవికాదని ఆయన సూచించారు.














.png&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!