
సినిమాలు

రేణుకా చౌదరి అమరావతి రాజధానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదని ఆమె విమర్శించారు. రాజధాని అంశంపై దాదాపు 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న అస్పష్టత రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు.
ఈ అస్పష్టత కారణంగా పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని, దుగరాజపట్నం పోర్టు వంటి కీలక హామీలు కూడా అమలు కాలేదని ఆమె అన్నారు. కేవలం బిల్లులు పెట్టడం కాకుండా సమయానికి రాజధానిని పూర్తి చేసి చూపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు హామీలు ఎందుకు నెరవేర్చలేదో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆమె కోరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!