

ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు, భారీ రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న నేపథ్యంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆర్థికశాఖ అధికారులకు ఆదేశించారు. సమీక్ష సమావేశంలో శాఖల కార్యదర్శులు తమ పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించి, ముఖ్యమైన వాటిని గుర్తించి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 15 శాతం వృద్ధి లక్ష్యాన్ని చేరుకునేలా సూక్ష్మ, స్థూల ప్రణాళికలను క్షేత్రస్థాయి వరకు అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.
వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నీరు, విద్యుత్ వంటి వనరులు నిరంతరంగా అందిస్తున్నామని, ఉత్పాదకత పెంపు దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, గత నిర్ణయాల వల్ల ఏర్పడిన ₹4,600 కోట్ల భారం ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు. ప్రజలపై భారం వేయకుండా ఆదాయ శాఖలు తమ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తైతే సంపద సృష్టి జరుగుతుందని, కేంద్ర సహకారంతో అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు. పేదల కోసం 269 అన్న క్యాంటీన్లను నిర్వహిస్తూ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!