
న్యూస్

బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సభకు పోటీగా అదే సమయంలో సభ పెట్టడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని ఆయన అన్నారు. కే చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రయోజనాలపై హుందాగా మాట్లాడగా, రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారని ఆరోపించారు.
రైతు భరోసా, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. ఓటుకు నోటు కేసు విషయంలోనూ ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజల్లో ఇంకా కేసీఆర్ పట్ల ఆదరణ ఉందని, వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!