

కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్నగర్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట, వికారాబాద్ వంటి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో అత్యధికంగా 6.4 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
వాతావరణశాఖ అంచనాల ప్రకారం మంగళవారం, బుధవారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున పంటలు, తోటలకు నష్టం కలగొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికన్నా తగ్గినట్లు తెలిపారు.













.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!